logo
తాజా వార్తలు

నపుంసక భర్త నిర్వాకం.. ఫస్ట్ నైట్ రోజు ఎంత పని చేశాడో తెలిస్తే...

నపుంసక భర్త నిర్వాకం.. ఫస్ట్ నైట్ రోజు ఎంత పని చేశాడో తెలిస్తే...
X
Highlights

దగ్గరి బంధువు, పైగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ఆకర్షణీయమైన జీతం...ఈ మూడింటిపై ముచ్చటపడి మరో ఆలోచన చేయకుండా పెళ్లికి...

దగ్గరి బంధువు, పైగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ఆకర్షణీయమైన జీతం...ఈ మూడింటిపై ముచ్చటపడి మరో ఆలోచన చేయకుండా పెళ్లికి ఒప్పేసుకున్నాడు ఓ తండ్రి. ఇక పెళ్లై 24 గంటలు గడవక ముందే భార్యకు ఫైస్ట్ నైట్ రోజే భర్త నరకం చూపించాడు. బెడ్ రూమ్ లో భార్యను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి, నపుంసకుడినని భార్యకు చెప్పి ఆమెకు షాక్ ఇచ్చాడు. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన కాముర్తి త్రివేణి, మాచాని రాజేంద్ర ప్రసాద్ కు గతేడాది ఆగస్టు 2న వివాహమైంది. ఒప్పందం ప్రకారం 45 లక్షలు కట్నం ఇచ్చి బంధుగణంతో మ్యారేజ్ ఘనంగా చేశారు. దాంపత్య జీవనానికి బాటలు వేసే మొదటి రాత్రిపై కలలు కంటూ ఆ గదిలోకి అడుగు పెట్టిన నవ వధువు భర్త వికృత చేష్టలతో నిశ్చేష్టురాలైంది. ఆమెను వివస్త్రను చేసి బాహ్య ప్రపంచం చూడరాని ప్రదేశాలను చిత్రీకరిస్తుంటే భర్త సరదాపడుతున్నాడని అనుకుంది. ఆ తర్వాత అతని నోటి వెంట వచ్చిన మాటలకు ఆమెను శిలా విగ్రహాన్ని చేసేశాయి. అద్దంలాటి ఆమె హృదయాన్ని ముక్కలు ముక్కలు చేశాయి.

ఫస్ట్ నైట్ రోజు తీసిన న్యూడ్ ఫోటోలు, వీడియోలను అడ్డంపెట్టుకుని... భయపెట్టడమే కాకుండా అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు. కూతురి సంసారం బాగు కోసం బాధితురాలి తండ్రి, అల్లుడికి పది లక్షల రూపాయలు రెండు విడతలుగా ఇచ్చేశాడు. కొద్ది రోజులకు భర్త లోపాన్ని బాధితురాలు అత్తకు తెలియజేసింది. దీంతో ఇంట్లో వారందరు ఆమెపై మరింత కక్ష్య గట్టి, నీకు టిబి రోగం ఉందనే నింద మోపారు. రోగం లేదని నిర్దారణ అయ్యాకే నీతో కాపురం చేయించుకుంటామని బాధితురాలికి హుకుం జారీ చేశారు. చేసేదేమిలేక బాధితురాలు డాక్టర్ల దగ్గరకు వెళ్లి టిబి పరిక్షలు చేయించుకుంది. వైద్యులు టిబి లేదని నిర్ధారించిన రిపోర్ట్స్ ను తీసుకెళ్లి చూపించినా భర్త కుటుంబీకులు నమ్మలేదు. పైగా గొడవలకు దిగారని బాధితురాలు చెప్తోంది.

ఇంత తతంగం జరిగినా త్రివేణి తన భర్త వేధింపుల గురించి ఒక్కమాట పుట్నింటి వాళ్లకు చెప్ప లేదు. కుటుంబాన్ని కట్టబెట్టేందుకు రెండు కుటుంబాల వారు పెద్దల దగ్గర పలుమార్లు పంచాయి తీ చేసుకున్నారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. చివరకు కాపురం చేయించుకోవడం మాకు ఇష్టం లేదంటూ భర్త, అత్త, ఆడపడుచు, మరిది, మరికొంతమంది మధ్య వర్తులు విడాకులు తీసు కోవాలంటూ ఆమెను బలవంతం చేయడంతో..త్రివేణి తనకు జరిగిన అన్యాయాన్ని కుటుబ సభ్యు లకు చెప్పుకుని కన్నీరు మున్నీరు అయ్యింది. కూతురు చెప్పిన పిడుగులాంటి వార్త విని ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగ కుప్పకూలి పోయారు. పెళ్లైనప్పటి నుంచి తన భర్త మానసికంగా, శారీరకంగా ఒక్కటి కాలేదని, ప్లాన్ ప్రకారం విడాకులు ఇచ్చి మరోపెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యాడని బాధితురాలు చెప్తోంది.

ఓవైపు కూతురు జీవితం సర్వ నాశనం అయిందన్న బాధలో తండ్రి ఉంటే... పోలీసులకు చెప్తారా ఆంటూ భర్త బంధువులు తమపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలి తండ్రి, బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారి బెధిరింపులు తట్టుకోలేక కర్నూలుకు వచ్చి బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు.

భర్త, అత్తారింటి వారు పెట్టిన చిత్రహింలు తట్టుకోలేక బాధితురాలు త్రివేణి స్ధానిక రాయదుర్గం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి నుంచి పోలీసులు కంప్లెంట్ తీసుకుని ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. మొత్తానికి భర్త శాడిజానికి, అత్తారింటి వేధింపులకు... ఓ మహిళకు ఏడాది కాలంపాటు మానసిక క్షోభ అనుభవిస్తోంది. తనకు పచ్చిన పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడని, చిత్రహింసలకు గురిచేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుకుంటోంది.

Next Story