కొత్త పట్టాదార్...పాస్‌ పుస్తకాలు

x
Highlights

కొత్త పాస్ పుస్తకాలు, రైతు బంధు పథకం అమలుతో అధికారులు అలసత్యం ప్రభుత్వంకు తలనొప్పిగా మరింది. సీఎం కేసీఆర్ అనేక సార్లు అధికారులను అదేశించినా తీరు...

కొత్త పాస్ పుస్తకాలు, రైతు బంధు పథకం అమలుతో అధికారులు అలసత్యం ప్రభుత్వంకు తలనొప్పిగా మరింది. సీఎం కేసీఆర్ అనేక సార్లు అధికారులను అదేశించినా తీరు మారలేదు. పట్టాదార్ పాసుపుస్తకాల ముద్రణలో తప్పుల తడకగా మారడంతో రెవెన్యూ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 16లక్షల పాస్‌ పుస్తకాలను ప్రింట్ చేయిస్తే 4.5 లక్షల పాస్‌ పుస్తకాల్లో భూ యజమాని పేరు, భూముల వివరాలు తప్పులు వచ్చాయ్. వీటి స్థానంలో కొత్త పాస్‌ పుస్తకాలను పంపిణీ చేసేందుకు రెవెన్యూ శాఖ సెక్యూరిటీ ప్రింట్‌కు ఆదేశించింది. దీంతో మణిపాల్ సెక్యూరిటీ ప్రింటర్స్‌ యుద్ద ప్రాతిపదికను పాస్‌ పుస్తకాలను ప్రింట్ చేసింది.

రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వడం కోసం కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను ప్రభుత్వం ముద్రించింది. అయితే ఆధార్ సీడింగ్‌తో పాటు పలు రకాల కారణాలతో దాదాపు నాలుగున్నర లక్షల పట్టదార్ పాస్ పుస్తకాలలో ఫోటోలు మిస్ మ్యాచ్ కావడమో, భూమి వివరాలు సరిపోల లేదు. ఇలా పలు కారణాలతో జరిగిన పొరపాట్లతో పాస్ పుస్తకాలను రైతులకు అందించకముందే అధికారులు పరిశీలించారు. ముద్రించిన పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు మండలాలకు చేరగానే వీఆర్ఓ, ఆర్‌ఐ తహశీల్దార్లు మరోసారి వాటిని పరిశీలించారు. తప్పులను గుర్తించిన అధికారుల వెంటనే సిసిఎల్ఎకు సమాచారం అందించారు. తప్పులు దొర్లిన పాస్ పుస్తకాలను అధికారులను రి- ప్రింటింగ్‌ చేయించారు.

మరో వైపు ధరణి వెబ్ సైట్ పనితీరు, రిజిస్ట్రేషన్ విధానంలో అనేక తప్పులు జరగుతున్నాయనే విమర్శలతో రెవెన్యూశాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ధరణి వెబ్‌సైట్‌లో అప్షన్స్‌ యాక్టివేట్‌ అయ్యాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ధరణి వెబ్‌సైట్‌ పని తీరు మెరుగు పడినట్లు రెవెన్యూ స్పెషల్ ఛీప్ సెక్రటెరి రాజేశ్వర్ తివారి తెలిపారు. వచ్చే నెల వరకు ధరణి వెబ్‌సైట్, పట్టాదార్ పాస్ పుక్తకాలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories