రేపే అతిధుల రాక.. తెలుగురాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

nanireddy
Updated on: 24 Dec 2018 1:37 PM IST
రేపే అతిధుల రాక.. తెలుగురాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
X

ఇప్పటికే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు రేపు కోస్తా తీరాన్ని తాకనుననట్టు తద్వారా తెలుగురాష్ట్రాలకు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ఇదిలావుంటే రేపటినుంచి 48 గంటలపాటు తెలుగురాష్ట్రాలకు భారీనుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడిస్తోంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈనెల 7,8 తేదీల్లో రానున్న నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందుగానే రావడం శుభసూచకం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

nanireddy

nanireddy

Next Story