ఇద్దరికి తీవ్రగాయలను చేసిన రోడ్డు ప్రమాదం

nanireddy
Updated on: 14 May 2020 11:13 PM IST
ఇద్దరికి తీవ్రగాయలను చేసిన రోడ్డు ప్రమాదం
X

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కోదాడ మండలం కోమరబండలో ఆగిఉన్న లారీని ఢీకొట్టటడంతో కారులోని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. హైదరాబాద్‌ నుంచి రావులపాలెం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులు సత్యనారాయణ(35), మైత్రి(21)గా గుర్తించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story