మళ్లీ వేడెక్కనున్న తమిళనాడు రాజకీయాలు

తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయ్. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలుపుతో రసకందాయంలో పడ్డాయ్. ఉప...
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయ్. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలుపుతో రసకందాయంలో పడ్డాయ్. ఉప ఎన్నికల్లో గెలిచి అమ్మకు వారసులం తామేనని అధికార పార్టీ భావించినా భంగపాటు తప్పలేదు. అటు డీఎంకే అభ్యర్థి మరదు గణేశ్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు. దినకరన్ ఎత్తుల ముందు అధికార, విపక్షాల నేతలు చిత్తయ్యారు. ఉప ఎన్నికల్లో గెలుపుతో అమ్మకు వారసుడు తానేనని నిరూపించుకున్నాడు.
తమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కనున్నాయ్. అమ్మ జయలలిత మృతితో ఆర్కేనగర్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి దినకరన్ తిరుగులేని విజయాన్ని సాధించాడు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎండ్ వరకు ప్రతి రౌండ్‌లోనూ దినకరన్ ఆధిక్యం సాధించి తనకు తిరుగులేదని చాటి చెప్పాడు. ఆర్కే నగర్‌లో గెలిచి దినకరన్‌కు బుద్ధి చెప్పాలనుకున్న అన్నాడీఎంకే ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఈ గెలుపుతో జయలలితకు అసలైన వారసుడు తానేనని దినకరన్ నిరూపించుకున్నాడు. అధికార పార్టీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోకపోవడం అటుంచితే కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది.
పార్టీ గుర్తు కోసం లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయినా ఉప ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేదు. పోలింగ్‌కు ఒక రోజు ముందు జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియోను విడుదల చేయించి ప్రత్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేశాడు. ఎన్నికల్లో గెలుపుపై మద్దతుగా నిలిచిన ఆర్కేనగర్ నియోజకవర్గ ప్రజలకు దినకరన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కోట్ల ప్రజలు, కార్యకర్తల గెలుపన్నారు. అన్నాడీఏంకే మరో మూడు నెలల్లో అధికార పార్టీ హోదాను కోల్పోతోందని దినకరన్ జోస్యం చెప్పారు. అమ్మ వారసుడిగా ఆర్కేనగర్ ప్రజలు తనను ఎన్నుకున్నారని తమదే నిజమైన అన్నాడీఏంకే అని దినకరన్ మరోసారి స్పష్టం చేశారు.
మరోవైపు ఉప ఎన్నికల ఫలితాల్లో తమిళ ఓటర్లు కమలం పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి కనీసం నోటాకు వచ్చిన ఓట్లలో మూడో వంతు ఓట్లు కూడా రాలేదు. బీజేపీకి వచ్చిన ఓట్లపై ఆ పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందించారు. కేంద్రంలో బీజేపీ ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో రికార్డ్ సృష్టించిందన్న ఆయన బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఉప ఎన్నికల్లో ఓటుకు నోటు బాగా పని చేసిందని తమిళనాడు బీజేపీ నేతలు అంటున్నారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Baby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMTRajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
12 Aug 2022 1:00 PM GMT