జియో మరో సంచలనాత్మక ఆఫర్

nanireddy
Updated on: 24 Dec 2018 1:25 PM IST
జియో మరో సంచలనాత్మక ఆఫర్
X

వినియోగదారులకు అతి తక్కువ ధరలతో 4G ఇంటర్నెట్ సేవలు ప్రారంభించి ఇతర టెలికం కంపెనీలకు సవాల్ విసిరింది జియో. మొబైల్ ఇంటర్నెట్ వాడకంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జియో తాజాగా మరో మార్పుకు శ్రీకారం చుడుతోంది. 4G బ్రాడ్ బ్యాండ్ హోమ్ పేరిట ఇంటికి కేబుల్ ద్వారా జియో 4G ఇంటర్నెట్ సేవలు ప్రారంభించనుంది. అందులో భాగంగా వినియోగదారులకు జియో మొబైల్ ఇంటర్నెట్ ఆఫర్ ఇచ్చినట్టు ఉచితంగానే కొద్దిరోజులపాటు ఈ సేవలు అందించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. నెలకు 1100 జీబీ ఉచిత డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఫైబర్ టు హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్ ఇవ్వాలనుకుంటున్నట్లు అనధికార సమాచారం. ఇందుకు రూ.4500 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌ను వసూలు చేస్తారని తెలుస్తోంది.

nanireddy

nanireddy

Next Story