logo
సినిమా

రెజీనా మ‌ళ్లీ ట్రాక్‌లో ప‌డుతుందా?

రెజీనా మ‌ళ్లీ ట్రాక్‌లో ప‌డుతుందా?
X
Highlights

సినిమా రంగంలో రాణించాలంటే అందం, అభిన‌యం.. ఈ రెండూ ఉంటే స‌రిపోదు. కాసింత అదృష్టం కూడా ఉండాలి. పాపం.. చెన్నై...

సినిమా రంగంలో రాణించాలంటే అందం, అభిన‌యం.. ఈ రెండూ ఉంటే స‌రిపోదు. కాసింత అదృష్టం కూడా ఉండాలి. పాపం.. చెన్నై చిన్న‌ది రెజీనా విష‌యంలో అదృష్టం ఎప్పుడూ ఆమ‌డ దూరంలో ఉంటోంది. అందుకే.. ఒక‌టీ ఆరా విజ‌యాలు వ‌చ్చినా.. స్టార్ హీరోల చిత్రాల్లో మాత్రం అవ‌కాశాలు పొంద‌లేక‌పోతోందీ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టివ‌ర‌కు డ‌జ‌ను తెలుగు చిత్రాలు చేసిన రెజీనాకి.. వాటిలో ఐదు సినిమాలు విజ‌యాలు అందించాయి. అయిన‌ప్ప‌టికీ ర‌వితేజ మినహా మ‌రో అగ్ర క‌థానాయ‌కుడు ఆమెకి ఆఫ‌ర్ ఇవ్వ‌లేదు. దాంతో స్టార్ మెటీరియ‌ల్ అనిపించుకోలేక‌పోయింది రెజీనా.

క‌నీసం కృష్ణవంశీ 'న‌క్ష‌త్రం' అయినా త‌న‌కు ట‌ర్నింగ్ పాయింట్ గా నిలుస్తుంద‌నుకుంటే.. ఆ సినిమా ఆమెకే కాదు అందులో న‌టించిన అంద‌రికీ చుక్క‌లు చూపించింది. ఇప్పుడు ఈమె చేతిలో ఉన్న ఒకే ఒక తెలుగు అవ‌కాశం.. నారా రోహిత్‌తో జోడీక‌ట్టిన 'బాల‌కృష్ణుడు'. ఈ సినిమా హిట్ అయితే.. రెజీనా మ‌ళ్లీ ట్రాక్‌లో ప‌డే అవ‌కాశముంది. లేదంటే క‌థ మొద‌టికే వ‌స్తుంది. 'జో అచ్యుతానంద‌'తో క‌లిసొచ్చిన రోహిత్‌.. మ‌రోసారి ఆమెకి విజ‌యాన్నిస్తాడా?

Next Story