లిక్కర్ కిక్కులో మందు బాబులు...ఎక్సైజ్‌ శాఖకు అంచనాలకు మించి...

లిక్కర్ కిక్కులో మందు బాబులు...ఎక్సైజ్‌ శాఖకు అంచనాలకు మించి...
x
Highlights

రాష్ట్రంలో మందు బాబులు మీద రికార్డులు సృష్టిస్తున్నారు.. ఎక్కడ కాస్త తగ్గుతాం కానీ.. ఇక్కడ మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు.. అమ్మకాల్లో రికార్డులు...

రాష్ట్రంలో మందు బాబులు మీద రికార్డులు సృష్టిస్తున్నారు.. ఎక్కడ కాస్త తగ్గుతాం కానీ.. ఇక్కడ మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు.. అమ్మకాల్లో రికార్డులు బ్రేక్ చేస్తూ.. కొత్త రికార్డులు సృష్టిస్తూ... ఎక్సైజ్‌ శాఖకు అంచనాలకు మించి ఆదాయాన్ని అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం తెగ తాగేస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖకు అంచనాలకు మించి ఆదాయాన్ని మందుబాబులు అందిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచీ ప్రతి నెలా మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకు 6,231 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్‌ గణాంకాలు చెపుతున్నాయి. గత ఆరు నెలల్లో 90లక్షలకు పైగా లిక్కర్ కేసులు అమ్ముడు పోగా 4వేల376 కోట్ల ఆదాయం వచ్చింది ఇక బీర్లు జోరు కూడా మామూలుగా లేదు ఇప్పటి వరకూ 1.8 కోట్ల కేసుల బీర్లు అమ్ముడు పోగా టీపీబీసీఎల్ కు 1వేయి 855 కోట్ల ఆదాయం వచ్చింది.

గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 900 కోట్లు ఎక్కువ. ఈ ఏడాది అమ్మకాలు గత పదేళ్లలోనే రికార్డు అని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలతో పాటు కల్తీలను నియంత్రించడంలో సఫలీకృతమైనందునే ఈ మేరకు విక్రయాలు పెరిగాయంటున్నారు. ఇక డిపోలవారీగా చూస్తే మహబూబ్ నగర్ టాప్ లో ఉంది అక్కడ 497కోట్లకు పైగా లిక్కర్ విక్రయం జరిగింది ఇక నల్గొండలో 481కోట్లు, మేడ్చల్ లో 479కోట్ల మందు విక్రయించారు ఈ మూడు డిపోల నుంచే 1,430 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరగడం కొత్త రికార్డు.

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గుడుంబా విక్రయాలపై ఎక్సైజ్‌ శాఖ ఉక్కుపాదం మోపింది. దాదాపు అన్ని జిల్లాలనూ గుడుంబారహిత జిల్లాలుగా ప్రకటించింది గుడుంబా అమ్మకందారులు పునరావాస ప్యాకేజీలు పకడ్బందీగా అమలు చేసింది దీంతో గుడుంబా విక్రయాలు పూర్తిగా ఆగిపోయాయి. మత్తు కల్లును నియంత్రించడంలోనూ ఎక్సైజ్‌ శాఖ కృషి ఫలించింది దీంతో గుడుంబా, మత్తు కల్లు అలవాటున్న వారంతా మద్యంవైపు వెళ్లారు దీంతో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి.

ఇక మద్యం తయారీ నుంచి సరఫరా, విక్రయాల వరకూ మూడు దశల్లో ఎక్కడా కల్తీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యాన్ని నివారించడంలో కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సఫలీకృతమయింది. కల్తీలను అరికట్టడం, కచ్చితమైన విధానాలను అమల్లోకి తేవడం, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చురుకుగా ఉండటం వల్ల రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగేందుకు తాము చర్యలే కారణమని ఎక్సైజ్‌ శాఖ అధికారులు చెపుతున్నారు. మొత్తానికి తెలంగాణలో మందు బాబులు తెగ తాగేస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories