ఫేక్ వెబ్‌సైట్ల తో అప్ర‌మ‌త్తంగా ఉండండి: ఆర్బీఐ

ఫేక్ వెబ్‌సైట్ల తో అప్ర‌మ‌త్తంగా ఉండండి: ఆర్బీఐ
x
Highlights

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట ఉన్న ఓ నకిలీ వెబ్‌సైట్‌ను నమ్మొద్దంటూ.. వినియోగదారులను హెచ్చరిస్తోంది ఆర్బీఐ. సేమ్ ఆర్బీఐ వెబ్ సైట్ లేఅవుట్ లానే ఉండే...

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట ఉన్న ఓ నకిలీ వెబ్‌సైట్‌ను నమ్మొద్దంటూ.. వినియోగదారులను హెచ్చరిస్తోంది ఆర్బీఐ. సేమ్ ఆర్బీఐ వెబ్ సైట్ లేఅవుట్ లానే ఉండే ఓ ఫేక్ వెబ్ సైట్స్ తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. తాము ఎప్పుడు ఖాతాదారుల నుంచి వ్యక్తిగత వివరాలను అడగమని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని నకిలీ సైట్ల పట్ల అలెర్ట్ గా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ప్రకటనలో తెలిపింది.

నకిలీ వెబ్ లైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్‌బీఐ పేరుతో ఓ నకిలీ వెబ్‌ సైట్‌.. ఖాతాదారుల నుంచి వివరాలను సేకరించి, ఆన్‌ లైన్‌ మోసాలకు పాల్పడుతోంది. దీంతో ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. ఖాతాదారులకు ఇలాంటి ఫేక్ వెబ్ సైట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఫేక్ వెబ్ సైట్ల నుంచి ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని భార‌త రిజ‌ర్వు బ్యాంకు విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌లో తెలిపింది. www.indiareserveban.org(ఇండియ రిజర్వ్ బ్యాన్ డాట్) పేరుతో ఒక ఫేక్ వెబ్ సైట్ ఉంద‌ని తెలిపింది. చూసేందుకు అచ్చం రిజ‌ర్వుబ్యాంకు వెబ్‌సైట్ లానే ఉండ‌టంతో.. ఖాతాదారులు మోసానికి గుర‌య్యే అవ‌కాశం ఉందని ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకింగ్ వివ‌రాలు ప్ర‌జ‌ల నుంచి పొందేలా త‌యారు చేసిన ఈ వెబ్‌సైటు ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. ఎవరూ అకౌంట్‌కు సంబంధించి వివరాలను ఇవ్వొద్దని.. ఆర్‌బీఐ ఎప్పుడు వినియోగదారుడి వివరాలను ప్రశ్నించదని చెప్పింది. www.rbi.org, www.rbi.in త‌దిత‌ర వెబ్‌సైట్లు అచ్చం ఆర్‌బీఐ యూఆర్ఎల్ లా క‌నిపించినా.. అవి ఫేక్ అని తెలిపింది. తమ అస‌లు వెబ్ సైట్ యూఆర్ఎల్ www.rbi.org.in అని చెప్పింది.

ఇటీవల కొంత కాలం నుంచి, ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత.. ఆర్‌బీఐ పేరిట కొన్ని ముఠాలు భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. క్రెడిట్‌ కార్డుల జారీ, యాప్‌ ద్వారా నగదు బదిలీ పేరుతో కోట్ల రూపాయాల్లో ఖాతాదారుల నుంచి సొమ్మును దోపిడీ చేశాయి. ఇలాంటి కేసుల్లో చాలా వరకు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎంత కట్టడి చేస్తున్నా నకిలీ వెబ్‌సైట్‌లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్నాయని.. వాటి హోం పేజీ... ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ను పోలి ఉండటంతో ఖాతాదారులు సులువుగా మోసపోతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories