‘అదుగో’ రిలీజ్ అవుతుంది..

‘అదుగో’ రిలీజ్ అవుతుంది..
x
Highlights

నటుడు, దర్శకుడు రవిబాబు మరో డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జంతువుల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి కానీ మొదటిసారి ఓ పందిపిల్ల ప్రధాన...

నటుడు, దర్శకుడు రవిబాబు మరో డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జంతువుల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి కానీ మొదటిసారి ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో ‘అదుగో’ సినిమాను రూపొందించారు రవిబాబు. ఇదివరకే ఈ సినిమాకు ప్రత్యేకమైన ప్రచారానికి తెరతీశాడు రవిబాబు. ఇక షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం చాలాసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది.. ఈ సినిమాకు ఫైనల్‌గా రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశారు దర్శకుడు రవిబాబు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అదుగో పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిషేక్, నాభ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను రవిబాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories