సొంతంగా చేసుకో.. 3 కోట్ల పంపు : యాంకర్ రష్మీ

nanireddy
Updated on: 24 Dec 2018 2:45 PM IST
సొంతంగా చేసుకో.. 3 కోట్ల పంపు : యాంకర్ రష్మీ
X

బుల్లి తెరపై హాట్ యాంకర్‌గా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ రష్మీ. ఈ అమ్మడు వెండి తెరపై అందాలు ఆరబోస్తూ కుర్రకారులకు చెమటలు పుట్టిస్తోంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అంతకుమించి'లో రష్మీ అందచందాలు చూసిన ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా రష్మీకి ఉచిత సలహా ఇచ్చాడు. 'రష్మీ నువ్ సొంతంగా సినిమాలు చేసుకో.. దర్శకుల నుండి వచ్చే అవకాశాల కోసం వేచిఉండకు' అని పేర్కొంటూ పోస్ట్ చేశాడు. దానికి స్పందించిన రష్మీ.. 'తప్పకుండా చేస్తా.. నా బ్యాంకు ఖాతా డీటెయిల్స్ నీకు పంపుతా.. 3 కోట్ల రూపాయలు పంపు.. గొప్ప సహాయం చేసిన వాడివి అవుతావు' అని నెటిజెన్ కు రిప్లై ఇచ్చింది. దీంతో ఈ పోస్టు కాస్త వైరల్‌గా మారింది.

nanireddy

nanireddy

Next Story