అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారయత్నం..

nanireddy
Updated on: 24 Dec 2018 1:48 PM IST
అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారయత్నం..
X

అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో మృగాడు. ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా తల్లిదండ్రులు గమనించి చితక్కొట్టారు. ఆపై గ్రామస్థులు కూడా తలో చెయ్యి వేశారు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది. శ్రీకాళహస్తి చెంచులక్ష్మి నగర్‌కు చెందిన బాలిక.. ఇంటిముందు ఆడుకుంటూ ఉండగా పక్కింట్లో ఉండే సుబ్బారావు పిలవడంతో వెళ్లింది. కొద్దిసేపటికే ఇంట్లోనుంచి ఆర్తనాదాలు వినిపించాయి. దీంతో చిన్నారి తల్లి సుబ్బారావు ఇంట్లో చూడగా బాలిక కనిపించింది.వెంటనే ఆమె భర్తను కేకవేసి ఇద్దరు సుబ్బారావును చితక్కొట్టారు. గ్రామస్తులు కూడా అతనికి దేహశుద్ది చేసి ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.

nanireddy

nanireddy

Next Story