విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా 'ఆటగదరా శివా' పాట..

'పవర్', 'లింగా', 'బజరంగీ భాయీజాన్' వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మిస్తోన్న లేటెస్ట్...
'పవర్', 'లింగా', 'బజరంగీ భాయీజాన్' వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మిస్తోన్న లేటెస్ట్ మూవీ 'ఆటగదరా శివ'. రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ మూవీని 'ఆ నలుగురు', 'మధు మాసం', 'అందరి బంధువయ' వంటి సెన్సిబుల్ మూవీస్ కు దర్శకత్వం వహించిన చంద్రసిద్ధార్థ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నూతన నటుడు ఉదయ్ శంకర్, కన్నడ నటుడు దొడ్డన్న ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆటగదరా శివా' జూలై14న విడుదల కాబోతోంది.. ఈ సినిమాలోని రామ రామ రే.. అనే పాటను విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది. నా గుండెను తాకిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా 'రామ రామ రామ రే...రామ రామ రామ రే' అంటూ సాగె ఈ పాటకు పులగం చిన్నారాయణ సాహిత్యం అందించగా, వాసుకీ వైభవ్ స్వరాలు సమకూర్చారు. సంగీత కత్తి, పూజ, ప్రణవ్, కార్తీక్, బృంద ఆలపించిన ఈ పాట ఇప్పటికే యూట్యూబ్ లో దూసుకెళుతోంది. కన్నడలో ఘన విజయం సాధించిన 'రామా రామారే' చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెలుగులో రూపొందించారు చంద్రసిద్దార్ధ.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
20 May 2022 4:31 AM GMTగన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMT