ప్రణయ్‌ హత్యపై స్పందించిన రాంగోపాల్‌వర్మ

nanireddy
Updated on: 24 Dec 2018 2:59 PM IST
ప్రణయ్‌ హత్యపై స్పందించిన రాంగోపాల్‌వర్మ
X

సంచలనం కలిగించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో పలువురు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు ప్రణయ్ హత్యపై తీవ్రంగా స్పందించారు. తాజగా ఈ పరిణామంపై స్పందించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ప్రణయ్ చంపించిన మారుతీరావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.. 'నిజమైన పరువు హత్య అంటే.. పరువు కోసం ఇతరుల ప్రాణాలు తీసేందుకు వెనకాడని వారిని చంపడమేనని చెప్పుకొచ్చారు. ఒకవేళ పరువు కోసమే ప్రణయ్‌ ప్రాణాలు తీయించానని చెప్పిన హంతకుడు తన పరువును చేజేతులా బజారుకీడ్చుకున్నాడు. పరువు పోయింది గనుక మారుతీరావు చనిపోయేందుకు సిద్ధంగా ఉండాలా' అని ప్రశ్నించాడు. కాగా కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న కారణంగా కక్ష గట్టిన మారుతీరావు ప్రణయ్ ను కిరాయి ముఠాతో విచక్షణా రహితంగా గత శుక్రవారం హత్య చేయించాడు.

nanireddy

nanireddy

Next Story