మోక్షజ్ఞకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్..?

nanireddy
Updated on: 24 Dec 2018 2:01 PM IST
మోక్షజ్ఞకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్..?
X

దివంగత నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్ బయోపిక్' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ గా ఆయన తనయుడు నటుడు బాలకృష్ణ నటిస్తున్నారు.దాదాపుగా ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక పూర్తయింది. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్‌ యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్న సంగతి తెలిసిందే. యువ ఎన్టీఆర్‌కు జోడిగా రకుల్‌ జతకట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రంలో కీలకం అవనున్నట్టు సమాచారం.

nanireddy

nanireddy

Next Story