సంచలన సర్వే.. ఆ పార్టీకి 150 సీట్లు!

nanireddy
Updated on: 24 Dec 2018 1:28 PM IST
సంచలన సర్వే.. ఆ పార్టీకి 150 సీట్లు!
X

ఎన్నికల సమయంలో ఆ పార్టీకి అన్ని సీట్లు వస్తాయి ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని ఈ మధ్య సర్వేలు తెగ హల్చల్ చేస్తున్నాయి. నిన్న (శనివారం) కర్ణాటక ఎన్నికలు ముగిశాయో లేదో మరుక్షణమే ఎగ్జిట్ పోల్స్ అంటూ మీడియాలో తెగ హోరెత్తాయి. కర్ణాటక ఎన్నికలు అటుంచి తాజాగా వచ్చే సాధారణ ఎన్నికల్లో తమిళనాడులో రజినికాంత్ పార్టీకి 150 సీట్లు వస్తాయని ప్రముఖ 'దినమలర్‌' పత్రిక సర్వే తేల్చేసింది. ఈ సర్వే పై పలు పార్టీల నేతల్లో గుబులు రేకెత్తుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ ప్రభంజనం సృష్టిస్తారని, ఆయన సీఎం కావడం తథ్యమని దినమలర్‌ నివేదికలో పేర్కొనడంతో ఇక మన భవిశ్యత్ ఏంటన్న ప్రశ్న ప్రస్తుత అధికారా, ప్రతిపక్ష పార్టీల నేతల్లో వ్యక్తమవుతుందట. దీంతో ఆ సర్వే పలితాలతో నేతలకు ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదట.

nanireddy

nanireddy

Next Story