మేకను చంపిన కొండచిలువ..గొడ్డలితో నరికిన కాపరి!

nanireddy
Updated on: 24 Dec 2018 1:38 PM IST
మేకను చంపిన కొండచిలువ..గొడ్డలితో నరికిన కాపరి!
X

ఆకలితో ఉన్న ఓ కొండచిలువ మేకను చంపి ఆ తరువాత తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలంలోని కోట్‌పల్లి ప్రాజెక్టు కట్ట కింద కట్ట మైసమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది. సమీపంలో మేకల కాపరి మేకలను మేపుతున్నాడు. ఆ సమయంలో మేకలవద్దకు ఓ భారీ కొండచిలువ వచ్చింది. దాన్ని చూసిన ఇతర మేకలు భయంతో పారిపోయాయి. అయితే ఓ మేక మాత్రం కొండచిలువ నోటికి చిక్కింది. ఈ క్రమంలో దాన్ని మింగుతుండగా గమనించిన కాపరి తన వద్దనున్న గొడ్డలితో కొండచిలువ నడుమీద నరికాడు. అనంతరం కొండచిలువ పొట్టలో ఉన్న మేకను బయటకు లాగాడు. అయితే, అప్పటికే మేక చనిపోయింది. తీవ్ర గాయాలతో కొండచిలువ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది.

nanireddy

nanireddy

Next Story