యువతిని వ్యభిచారంలోకి దింపి..

nanireddy
Updated on: 24 Dec 2018 1:35 PM IST
యువతిని వ్యభిచారంలోకి దింపి..
X

ఉన్నత చదువులు చదివిన మూర్కుడొకరు ..తక్కువకాలంలో ఎక్కువడబ్బు సంపాదనే లక్షంగా దుర్మార్గంలో నడిచాడు. ఆపై పోలీసులకు అడ్డంగా దొరికిపోయూయడు. వివరాల్లోకి వెళితే నెల్లూరులో దర్గామిట్ట ప్రాంతానికి చెందిన షేక్‌రహ్మాన్‌ (22) ఇంజినీరింగ్‌ చేశాడు. చిన్న ఉద్యోగంలో చేరాడు.. తక్కువ వేతనం వస్తోందని ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువడబ్బు సంపాదించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఒంగోలులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది ఓ యువతి.. ఆమెతో ఇదివరకే పరిచయం పెంచుకున్నాడు. ఎక్కువ డబ్బు సంపాదించాలంటే నా దగ్గర ఓ ప్లాన్ ఉందని ఆమెను హైదరాబాద్ రప్పించాడు. బంజారాహిల్స్ లో ఓ ప్లాట్ అద్దెకు తీసుకున్నాడు సదరు యువతి ఫొటోలు ఆన్‌లైన్‌లో పోస్టు చేసి విటులను ఆకర్షించాలని చూశాడు. ఈ విషయం బంజారాహిల్స్‌ పోలీసులకు తెలిసి గురువారం రాత్రి సదరు గృహంపై దాడి చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

nanireddy

nanireddy

Next Story