యూట్యూబ్ తెచ్చిన తంటా.. ప్రాణభయంతో జనం పరుగులు

యూట్యూబ్ తెచ్చిన తంటా.. ప్రాణభయంతో జనం పరుగులు
x
Highlights

యూట్యూబ్ లో చూసి ఓ వ్యక్తి నాటుతుపాకీ తయారు చేశాడు. పేలుతుందో లేదో అని టెస్ట్ చేసి అనూహ్యంగా పోలీసులకు దొరికాడు. ఈ ఘటన తుప్రాన్‌ గ్రామంలో...

యూట్యూబ్ లో చూసి ఓ వ్యక్తి నాటుతుపాకీ తయారు చేశాడు. పేలుతుందో లేదో అని టెస్ట్ చేసి అనూహ్యంగా పోలీసులకు దొరికాడు. ఈ ఘటన తుప్రాన్‌ గ్రామంలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా కోడూర్‌ గ్రామానికి చెందిన మరదన రమేశ్‌ (26) నగరంలోని ఓ స్టీల్‌ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో యూట్యూబ్ చూసేవాడు. ఈ క్రమంలో తుపాకీ తయారు చేయడం ఎలాగో చూసి నాటు తుపాకీ తయారు చేశాడు. ఇది పేలుతుందో లేదో అని తుప్రాన్‌ గ్రామపంచాయితీ వెనుకాల ఉన్న కల్లు దుకాణంలోకి వెళ్లి ఓ తూటాను పేల్చాడు. సడన్ గా పెద్ద శబ్దం రావడంతో జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు.ఇంతలో ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న ఎస్సై.. రమేశ్‌ ను అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories