ప్రభాస్ కొత్త సినిమా బడ్జెట్ చూస్తే..

ప్రభాస్ కొత్త సినిమా బడ్జెట్ చూస్తే..
x
Highlights

బాహుబలి తరువాత హీరో ప్రభాస్ సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ స్నేహితుడు మరియు సోదరుడు.. వంశీకృష్ణారెడ్డి ,...

బాహుబలి తరువాత హీరో ప్రభాస్ సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ స్నేహితుడు మరియు సోదరుడు.. వంశీకృష్ణారెడ్డి , ప్రమోద్ కుమార్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ నటీ శ్రద్దా కపూర్ ప్రభాస్ కు జోడిగా నటిస్తోంది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. బాహుబలి తరువాత వస్తున్న ఈ మోస్ట్ అవెయిటెడ్ మూవీని దాదాపు రూ.. 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారని ఫిలింనగర్ టాక్. అందులోని యాక్షన్ సీన్స్ కే ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్టు వినికిడి. ఇదిలావుంటే ప్రభాస్ , రాజమౌళి , కీరవాణి , తమన్నాల కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన సంగతి తెలిసిందే. శుక్రవారం బాహుబలి 2 చిత్రం చైనాలో 7000 వేల థియేటర్లకు పైగా విడుదలవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories