ఉగాండా పార్లమెంటులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ

nanireddy
Updated on: 24 Dec 2018 2:03 PM IST
ఉగాండా పార్లమెంటులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ
X

భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటనలో భాగంగా రువాండలో పర్యటించారు. మొదటి రోజు ఆ దేశాధ్యక్షుడు పాల్‌ కిగామితో భేటీ ఆయిన మోడీ పలు అంశాలపై చర్చలు జరిపారు. మోడీ, పాల్‌ పలు అంశాలపై పరస్పర ఒప్పందాలు చేసుకున్నారు. అక్కడి భారత సంతతి పౌరులతో మోడీ సమావేశమయ్యారు. అనంతరం రువాండ దేశాధ్యక్షుడు ఇచ్చిన విందులో మోడీ పాల్గొన్నారు. ఇక నేటినుంచి(మంగళవారం) రెండు రోజుల పాటు మోడీ ఉగాండాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఉగాండా దేశాధ్యక్షుడు యోవెరి ముసెవెనితో భేటీకానున్నారు.. ఇరు దేశాలకు సంబంధించి పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. ఆ దేశ పార్లమెంటులోనూ మోడీ ప్రసంగిస్తారు.

nanireddy

nanireddy

Next Story