‘టైగర్’ హెచ్ఎం రెడ్డి పాత్రలో కైకాల

nanireddy
Updated on: 24 Dec 2018 2:04 PM IST
‘టైగర్’ హెచ్ఎం రెడ్డి పాత్రలో కైకాల
X

కైకాల సత్యనారాయణ.. ఈ పేరు వింటే ముందుగా గుర్తుకు వచ్చేది అయన సహజ శైలి నటన, ఎటువంటి క్యారెక్టర్ లోనైనా యిట్టె ఒదిగిపోయే నవరస నట సార్వభౌముడు, తెలుగు సినిమాకు ఆణిముత్యమైన సత్యనారాయణ ఆరోగ్యకారణాల రీత్యా కొంత కాలంగా సినిమాలకు దూరమయ్యారు. తాజాగా అయన మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రంలో కైకాల కనిపించనున్నారు. కాళిదాస, భక్త ప్రహ్లాద చిత్రాలతో దక్షిణ భారతీయ సినిమాకి పునాది వేసిన పితామహుడు ‘టైగర్’ హెచ్ఎం రెడ్డి పాత్రలో కైకాల కనిపించనున్నారు. ఈ మేరకు అయన జన్మదినం సందర్బంగా ఎన్టీఆర్ యూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ‘నవరస నట సార్వభౌమ శ్రీ కైకాల సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ అందులో పేర్కొంది.

nanireddy

nanireddy

Next Story