మరో మలుపు తిరిగిన డాక్టర్ శిల్ప సూసైడ్ కేసు

nanireddy
Updated on: 24 Dec 2018 2:37 PM IST
మరో మలుపు తిరిగిన డాక్టర్ శిల్ప సూసైడ్ కేసు
X

తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ శిల్ప సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట ప్రొఫెసర్ల వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమన్న ఆరోపణలు రాగా.. ఇప్పుడు ఆమె వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్య చేసుకుందనే వాదన వినిపిస్తోంది. దీంతో డాక్టర్ శిల్ప సూసైడ్ ఎపిసోడ్.. కాలేజీని కుదిపేస్తోంది. ఓ వైపు జూనియర్ డాక్టర్లు.. మరోవైపు ప్రొఫెసర్ల పోటా పోటీ ఆందోళనలతో యూనివర్శిటీ అట్టుడుకుతోంది. శిల్పమృతికి ప్రొఫెసర్ల వేధింపులే కారణమని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తుంటే.. ఆమె కేవలం ఒత్తిడితో చనిపోయిందని అంటున్నారు ప్రొఫెసర్లు.. అయితే ప్రస్తుతం శిల్ప ఆత్మహత్య కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ ఎస్పీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం వాస్తవాలను వెలికి తీసే పనిలో ఉంది. విద్యార్ధులతో పాటు కళాశాల సిబ్బందిని ప్రశ్నించింది. అటు హైలెవల్ కమిటీ కూడా నిజనిర్ధారణ చేస్తోంది.

nanireddy

nanireddy

Next Story