మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు!

nanireddy
Updated on: 24 Dec 2018 1:41 PM IST
మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు!
X

దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 14 రోజులనుంచి ధరలు పైసా పైసా తగ్గించుకుంటూ వస్తున్నాయి ఆయిల్ కంపెనీలు. ఈ క్రమంలో సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు కొంతమేర తగ్గాయి. పెట్రోల్‌పై 15పైసలు, డీజిల్‌ పై 10పైసల చొప్పున ధరలు తగ్గించింది ఇండియన్‌ ఆయిల్‌ కార్పేరేషన్‌. దీంతో ఢిల్లీ, కోలకతా ముంబై, చెన్నైతదితర మెట్రో నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు10, 15 పైసలు తగ్గాయి.

nanireddy

nanireddy

Next Story