దినకరన్ ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి

nanireddy
Updated on: 24 Dec 2018 2:06 PM IST
దినకరన్ ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి
X

చెన్నైలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఆర్కేనగర్ ఎమ్మెల్యే టివివి దినకరన్ ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారు దుండగులు. అడయార్‌లోని ఇంటిపై పెట్రోల్ బాంబు విసరడంతో అయన కారు ధ్వంసమైంది. దినకరన్ కారు డ్రైవర్‌తో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దాడి సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్కే నగర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తర్వాత అమ్మ మక్కల్‌ మున్నేట్ర కగజమ్‌ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆయన వ్యతిరేక వర్గీయులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పేలుడుకు పాల్పడిన దుండగుల కోసం ట్రేస్ చేసే పనిలోపడ్డారు పోలీసులు.

nanireddy

nanireddy

Next Story