జనసేన ఫ్లెక్సీ కడుతూ..ఇద్దరు అభిమానుల మృతి

nanireddy
Updated on: 24 Dec 2018 1:38 PM IST
జనసేన ఫ్లెక్సీ కడుతూ..ఇద్దరు అభిమానుల మృతి
X

విశాఖజిల్లా పాయకరావుపేటలో పెను విషాదం చోటుచేసుకుంది. పోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పాయకరావుపేటలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా అయన అభిమానులైన శివ, నాగ రాజులు 30 అడుగుల ఫ్లెక్సీని తయారుచేయించారు.దీన్ని శివ, నాగ రాజులుసూర్యమహల్‌ సెంటర్‌లో అమర్చుతుండగా ప్రమాదవశాత్తూ కరెంట్‌ వైర్లు తగిలి షాక్‌కు గురయ్యారు.. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలువిడిచారు. కాగా వీరిని తుని, పాయకరావుపేట వాసులుగా గుర్తించారు.

nanireddy

nanireddy

Next Story