నెల్లూరులో నేడు పవన్ పర్యటన.. భారీ ఏర్పాట్లు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం నెల్లూరులో పర్యటించనున్నారు.నెల్లూరు స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగకు పవన్ హాజరుకానున్నారు. అనంతరం బారాషహీద్ దర్గాలో అయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. కాగా పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పవన్ రాక సందర్బంగా అయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే ప్రతి ఏటా మొహరం పండుగను పురష్కరించుకుని నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పండుగకు దేశ, విదేశాల నుంచి హిందూ, ముస్లిం ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
Next Story




