పవన్ చేతులమీదుగా ‘ఆటగదరా శివా’ మరో పాట..

nanireddy
Updated on: 24 Dec 2018 1:59 PM IST
X

రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాతగా 'ఆ న‌లుగురు', 'మ‌ధు మాసం', 'అంద‌రి బంధువ‌య‌' వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ కు దర్శకత్వం వహించిన చంద్ర‌సిద్ధార్థ్ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఆటగదరా శివా’ అనే చిత్రం రూపొందుతోంది. కన్నడలో ఘనవిజయం సాధించిన 'రామా రామా రే' చిత్రానికి రీమేక్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. నూతన నటుడు ఉద‌య్ శంక‌ర్, కన్నడ నటుడు దొడ్డన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక 'ఆటగదరా శివా' సినిమాలోని మరో పాటను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. 'ఎట్టాగయ్య శివ శివ.. నీవన్నీ వింత ఆటలే' అంటూ సాగే ఈ పాటను అనన్యా భట్ ఆలపించగా.. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే రామ రామ రే.. అనే పాటను విక్ట‌రీ వెంక‌టేశ్ చేతుల మీదుగా విడుదల చేయగా.. ఆ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

nanireddy

nanireddy

Next Story