పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స..

nanireddy
Updated on: 24 Dec 2018 1:58 PM IST
పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స..
X

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది.కొంతకాలంగా కంటి సమస్యతో బాధపడుతున్న పవన్ పది రోజుల క్రితం ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. దాంతో అయన కంటిని పరిశీలించిన వైద్యులు ఎడమ కంటిలో కురుపును గుర్తించారు. దాంతో శస్త్ర చికిత్స చేయడమే మార్గమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో పవన్‌ కళ్యాణ్ ఆసుపత్రిలో చేరగా గురువారం విజయవంతంగా వైద్యులు శస్త్రచికిత్స పూర్తి చేశారు.అయితే నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు వైద్యులు సూచించారు. ఆయన ఈనెల 16 నుంచి తూర్పుగోదావరి ప్రజాపోరాట యాత్రలో పవన్‌ పాల్గొనాల్సి ఉంది. వైద్యుల సలహా నేపథ్యంలో పవన్ యాత్ర యథావిథిగా కొనసాగుతుందా లేక డాక్టర్ల సలహాతో మార్పులు చోటుచేసుకుంటాయా అనేది తెలియాల్సి ఉంది.

nanireddy

nanireddy

Next Story