ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు

nanireddy
Updated on: 24 Dec 2018 2:57 PM IST
ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు
X

ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తమ సత్తా చూపించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. భారత్ బౌలింగ్ దెబ్బకు 43.1 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. పాక్ ఆటగాళ్లను భారత్ బౌలర్లు ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. కేదార్‌ జాదవ్‌ (3/23), పేసర్లు భువనేశ్వర్‌(3/15), బుమ్రా(2/23)ల దెబ్బకు దాయాదీ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. 121 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాక్‌కు అష్రఫ్, మహ్మద్ అమిర్ సాయంతో వికెట్లు పోకుండా జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బుమ్రా దెబ్బకు అష్రఫ్ కూడా వెనుదిరిగాడు.

nanireddy

nanireddy

Next Story