విజ‌య‌ద‌శ‌మికి 'ఆక్సిజ‌న్' ట్రైల‌ర్‌

విజ‌య‌ద‌శ‌మికి ఆక్సిజ‌న్ ట్రైల‌ర్‌
x
Highlights

గోపీచంద్‌, రాశి ఖ‌న్నా, అను ఇమ్మానియేల్ హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం 'ఆక్సిజ‌న్‌'. 'నీ మ‌న‌సు నాకు తెలుసు' ఫేం ఎం.జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ...

గోపీచంద్‌, రాశి ఖ‌న్నా, అను ఇమ్మానియేల్ హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం 'ఆక్సిజ‌న్‌'. 'నీ మ‌న‌సు నాకు తెలుసు' ఫేం ఎం.జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత‌మందించిన ఈ చిత్రం ఆడియోని అక్టోబ‌ర్ తొలి వారంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైల‌ర్‌ని విజ‌య‌ద‌శ‌మి రోజున మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్నారు. 'లౌక్యం' త‌రువాత స‌రైన హిట్ లేని గోపీచంద్‌కి ఈ సినిమా విజ‌యం కీల‌కంగా మారింది. అక్టోబ‌ర్ 27న 'ఆక్సిజ‌న్‌' ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories