‘అరవింద సమేత వీర రాఘవ’లో మెగాస్టార్..?

‘అరవింద సమేత వీర రాఘవ’లో మెగాస్టార్..?
x
Highlights

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ త్రివిక్రమ్ శ్రీనివాస రావు దర్శకత్వంలో మొదటిసారి ఎన్టీఆర్ నటిస్తున్నారు....

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ త్రివిక్రమ్ శ్రీనివాస రావు దర్శకత్వంలో మొదటిసారి ఎన్టీఆర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం టాకీ పార్ట్‌ దాదాపు కంప్లీట్‌ అయిందని సమాచారం. ప్రస్తుతం సాంగ్స్‌ షూట్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్, పూజా హెగ్డేలపై పాట చిత్రీకరణ జరుగుతోంది. పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అరవింద సమేతలో అతిథి పాత్రలో కనిపిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా పూజా హెగ్డే కథానాయిక. హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై యస్‌. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో జగపతిబాబు, ఈషా రెబ్బా, నాగబాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్‌ 10న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: యస్‌.యస్‌. తమన్, కెమెరా: పీయస్‌ వినోద్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories