వర్మకు షాకిచ్చిన సీసీఎస్ పోలీసులు

వర్మకు షాకిచ్చిన సీసీఎస్ పోలీసులు
x
Highlights

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. రాంగోపాల్ వర్మకు సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీచేశారు. జీఎస్టీ (గాడ్...

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. రాంగోపాల్ వర్మకు సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీచేశారు. జీఎస్టీ (గాడ్ సెక్స్ అండ్ ట్రుత్)పై నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు వర్మకు నోటీసులందజేశారు. ఈ కేసులో వర్మ నేడు సీసీఎస్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా..విచారణకు హాజరుకాలేనని లాయర్ ద్వారా వర్మ పోలీసులకు తెలియజేశాడు.

వర్మ దర్శకత్వం వహించిన గాడ్ సెక్స్ అండ్ ట్రుత్ (జీఎస్టీ) వెబ్ సిరీస్ విడుదల కాకుండా చూడాలని కోరుతూ సామాజిక కార్యకర్త, మహిళాసంఘం నాయకురాలు దేవి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. వచ్చే వారం మళ్లీ నోటీసులు ఇస్తే, విచారణకు హాజరవుతానని వర్మ తెలిపాడు. ఈ నేపథ్యంలో, వర్మకు మళ్లీ నోటీసులు ఇవ్వడానికి సీసీఎస్ పోలీసులు సిద్ధమయ్యారు. ఆ నోటీసుకు కూడా వర్మ రాకపోతే, అరెస్ట్ వారెంట్ జారీ చేసే యోచనలో అధికారులు ఉన్నారని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories