టీకాంగ్ లో చిచ్చుపెట్టిన రాహుల్ నిర్ణ‌యం

టీకాంగ్ లో చిచ్చుపెట్టిన రాహుల్ నిర్ణ‌యం
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణయానికి వచ్చిందా? పూర్తిస్థాయిలో, స్వార్దంలేకుండా పనిచేసే...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణయానికి వచ్చిందా? పూర్తిస్థాయిలో, స్వార్దంలేకుండా పనిచేసే అధ్యక్షులను నియమించాలని పార్టీ నిర్ణయించిందా? ఇక అసెంబ్లీ టిక్కెట్లు కావాల్సిన వాళ్లు జిల్లా పదవులు వదులుకోవాల్సిందేనా? తాజా పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానమొస్తోంది.

గతంలో పార్టీలో తీవ్ర దుమారం రేపిన జిల్లా అధ్యక్షులకు టిక్కెట్టు కట్ పద్దతి మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా కాంగ్రెస్ అధిష్టానం అదే పద్దతిని కొనసాగించాలని పీసీసీలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. డీసీసీలకు టిక్కెట్లు ఉండవని పార్టీ అధినేత రాహుల్ ఖరాకండిగా చెప్పాలని పీసీసీలను ఆదేశించారట. పార్టీకి పూర్తిస్థాయి పనిచేసే నాయకులు ఉన్నప్పుడు జిల్లాల్లో విజయాలు సాధించడం సాధ్యమవవుతుందని రాహుల్ చెప్పిన్నట్లు పీసీసీ అధ్యక్షుడు చెబుతున్నారు. డీసీసీలు వినని పక్షంలో తానే స్వయంగా వారితో మాట్లాడుతానని రాహుల్ స్పష్టం చేసిన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఇప్పుడున్న 31 జిల్లాలకు అధ్యక్షులను కాకుండా పాత ఉమ్మడి జిల్లాలకే అధ్యక్షులుగా నియమించాలని కాంగ్రెస్ బావిస్తోంది. పార్టీ అధికారంలోకి రావాలంటే జిల్లా అధ్యక్షులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని పార్టీ భావిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తే వారు తమ నియోజకవర్గానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి జిల్లా వ్యాప్తంగా తిరగలేక పోతారనే అభిప్రాయానికి జాతీయ నాయకత్వం వచ్చినట్లు సమాచారం.

అయితే కొత్త నిర్ణయంపై డీసీసీలు తీవ్రంగా మండిపడుతున్నారు. అలాంటి నిర్ణయాన్ని పార్టీ అమలు చేస్తే తాము అధ్యక్ష పదవిని కూడ వదులుకుంటామని డీసీసీలు చెబుతున్నారు. పార్టీ కోసం పని చేసే తమను పోటీకి దూరంగా పెట్టడం ఎలా కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories