కావేరీ జలాలపై ఏరాష్ట్రానికి సంపూర్ణ హక్కులేదు

కావేరీ జలాలపై ఏరాష్ట్రానికి సంపూర్ణ హక్కులేదు
x
Highlights

కావేరీ నదీ జలాలపై సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. కావేరి జలాలపై ఏరాష్ట్రానికి సంపూర్ణ హక్కులేదని సుప్రీం కోర్టు స్పష్టం...

కావేరీ నదీ జలాలపై సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. కావేరి జలాలపై ఏరాష్ట్రానికి సంపూర్ణ హక్కులేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు 177.25 టిఎంసీలు, బెంగళూరు తాగునీటి కోసం అదనంగా 4.75 టిఎంసీల కేటాయించాలని ఆదేశించింది. 192 టిఎంసీలు కోరిన తమిళనాడు.177.25 టిఎంసీలను కేటాయించింది. కర్ణాటకకు అదనంగా 17.75 టిఎంసీలు కేటాయించింది. మిగత రాష్ట్రాలు యథాతధంగా పంపిణీ చేశారు.


నీటి పంపిణీలపై 2007నాటి కావేరీ జల వివాద పరిష్కార ట్రైబ్యునల్‌ తీర్పును వ్యతిరేకిస్తూ తమిళనాడు, కర్ణాటక, కేరళ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఈ అప్పీళ్లపై విచారణ చేపట్టింది. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలంటూ కేసు విచారణ సమయంలోనే కర్ణాటకకు సుప్రీం కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దీనిని ధిక్కరించిన కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది.


రెండు చోట్ల హై అలర్ట్‌
కావేరీ జలాల పంపిణీ కేసులో శుక్రవారం సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటక పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు బలగాలు రాష్ట్రాల్లో మోహరించాయి. బస్సు సర్వీసులు పూర్తిగా రద్దు చేశారు. గురువారం రాత్రి తమిళనాడు బస్సులు కర్ణాటకకు, కర్ణాటక బస్సులు తమిళనాడు వెళ్లాయి. రెండు రాష్ట్రాల్లోని ఆ బస్సులను ఆయా ప్రాంతాల్లో నిలిపివేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories