బీజేపీతో పొత్తుపై తేల్చేసిన జనసేనాని!

బీజేపీతో పొత్తుపై తేల్చేసిన జనసేనాని!
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ నష్టం కలగకూడదనే పవన్‌ ట్వీట్లు చేస్తున్నారంటూ చంద్రబాబు...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ నష్టం కలగకూడదనే పవన్‌ ట్వీట్లు చేస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేనాని గట్టిగా బదులిచ్చారు. ‘బీజేపీని వెనకేసుకొస్తే మాకు వచ్చే లాభమేంటని జనసేనాని ప్రశ్నించారు? ప్యాకేజీకి ఒప్పుకొని మళ్లీ యూ టర్న్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని ట్విట్టర్ లోనే కౌంటర్ ఎటాక్ చేశారు .

లోక్ సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయాక జనసేన అధినతే పవన్ కల్యాణ్ టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగత లాభాల కోసం టీడీపీ ప్రత్యేక హోదాకు మూడున్నరేళ్ల పాటు తూట్లు పొడిచిందని పేర్కొన్నారు. అలాంటి పార్టీ నేతలు ఇప్పుడ వ్యర్ధ ప్రసంగాలు చేస్తే లాభమేంటంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నల పరంపర కొనసాగించారు జనసేనాని.

ఏపీ ప్రజలు బీజేపీని సంపూర్ణంగా వదిలేశారని అలాంటి పార్టీతో రాష్ట్రంలో పొత్తు ఎవరన్నా పెట్టుకుంటారా అని బీజేపీతో దోస్తీపై పవన్ కుండబద్ధలు కొట్టారు. బీజేపీతో సమానంగా టీడీపీ కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీసి ప్రజలను మోసగించి వంచించారన్నారు. బీజేపీతో కుమ్మక్కయ్యిందెవరు టీడీపీ ఓసారి వెనక్కి తిరిగి చూసుకొని మాట్లాడలని సూచించారు. గజినీ సినిమా హీరో ‘షార్ట్ టైం మెమొరీ లాస్‌’తో ఎలా బాధపడతాడో టీడీపీ కూడా ‘కన్వినియెంట్ మెమొరీ లాస్ సిండ్రోమ్’తో బాధపడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు.

ఏపీ అంటే 175 మంది ఎమ్మెల్యేలు, 25మంది ఎంపీలు కాదని వీరు మాట్లాడే ప్రతీమాట, చేసే ప్రతీచర్య ఐదు కోట్ల మంది ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని పవన్ సూచించారు. ఈతరం యువత మేల్కోవాలని, మౌనం పనికిరాదని పవన్ ట్వీట్ చేశారు. జనసేన సొంత ప్రయోజనాల కోసం పనిచేయదని, ఏపీ ప్రజల హక్కు కోసం పోరాడుతుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories