తవ్వేకొద్దీ బయటపడుతున్న కిలోల కొద్దీ బంగారం

nanireddy
Updated on: 24 Dec 2018 1:23 PM IST
తవ్వేకొద్దీ బయటపడుతున్న కిలోల కొద్దీ బంగారం
X

నెల్లూరు ఆర్టీఓ అటెండర్ నరసింహారెడ్డి ఆస్తులపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. తవ్వేకొద్దీ ఆస్తులు, బంగారం, నగదు నిల్వలు బయటపడుతున్నాయి. నరసింహారెడ్డి కుమార్తె లాకర్లో భారీగా బంగారం, క్యాష్ నిల్వలున్నట్లు గుర్తించారు. కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లాకర్‌లో రెండున్నర కిలోల బంగారం, సిటీ యూనియన్‌ బ్యాంక్‌లో కిలో 35 గ్రాముల బంగారంతో పాటు ఏడు కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. నరసింహారెడ్డి అత్తగారి ఊరు ఆత్మకూరులోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే 100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు.

nanireddy

nanireddy

Next Story