సెంటిమెంట్‌ అస్త్రంతో ఆయింట్‌మెంట్‌.. ఇందూర్‌ సభ ట్రైలరేనా!!

సెంటిమెంట్‌ అస్త్రంతో ఆయింట్‌మెంట్‌.. ఇందూర్‌ సభ ట్రైలరేనా!!
x
Highlights

అపోజిషన్‌ అలయన్సే లక్ష్యంగా అణ్వస్త్రాల్లాంటి విమర్శలు. మహాకూటమి టార్గెట్‌గా మాటల మంటలు. జనంలో కూటమిని కూల్చడమో, కుళ్లబొడవడమో, ధ్యేయంగా గులాబీ...

అపోజిషన్‌ అలయన్సే లక్ష్యంగా అణ్వస్త్రాల్లాంటి విమర్శలు. మహాకూటమి టార్గెట్‌గా మాటల మంటలు. జనంలో కూటమిని కూల్చడమో, కుళ్లబొడవడమో, ధ్యేయంగా గులాబీ దళాధిపతి వాగ్భాణాలు. హుస్నాబాద్‌ సభ తర్వాత, కాస్త గ్యాప్ తీసుకున్న కేసీఆర్, నిజామాబాద్ సభలో, మహాకూటమిపై యుద్ధం ప్రకటించారు. మహాకూటమిగా జతకడుతున్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లపై కొన్నాళ్లుగా, కేటీఆర్, హరీష్, కవితలతో పాటు కీలక గులాబీ నేతలు, పదునైన విమర్శలు చేస్తూ వచ్చారు. కూటమిని కుల్లబొడిచి, వీలైతే చీలిక తెచ్చేలా, విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడు ఆ టార్గెట్‌పై గులాబీ దళాధిపతి అణ్వస్త్రాల్లాంటి బాంబులేశారు. కూటమి గోడలను కూలగొట్టడమే లక్ష్యంగా, నిజామాబాద్‌ ప్రజాశీర్వాద సభలో నిప్పులు చెరిగారు. తెలంగాణను నాశనం చేసిన వ్యక్తితో జట్టుకట్టారని, సిగ్గులేకుండా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నారా అని కాంగ్రెస్ నేతలనుద్దేశించి ప్రశ్నించారు.

తెలంగాణలో ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు కేసీఆర్. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న దుర్మార్గులకు ఏ శిక్ష వేయాలో ప్రజలే ఆలోచించాలన్నారు. రైతు బంధు చెక్కులు ఆపాలని కాంగ్రెస్‌ నేతలు కోర్టులో కేసు వేశారని విమర్శించారు. నాడు దమ్ముంటే ఎన్నికలకు రావాలన్నారని, నేడు అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు రాగానే కాంగ్రెస్ నేతలు ఆగమాగం అవుతున్నారని అన్నారు కేసీఆర్. తెలంగాణ ఏర్పాటులో టీఆర్‌ఎస్‌ పాత్ర లేదనడానికి ఆజాద్‌కు సిగ్గుండాలని ఘాటైన కామెంట్స్ సంధించారు గులాబీ బాస్. మొత్తానికి హుస్నాబాద్‌ సభతో ఎన్నికల శంఖారావం పూరించి కాస్త విరామం తీసుకున్న కేసీఆర్, నిజామాబాద్‌ సభతో ఒక్కసారిగా ఎన్నికల వేడిని రగిలించారు. కూటములు కడుతున్న పార్టీలను ఏకిపారేశారు.

మహాకూటమిని జనంలో పలుచన చేేందుకు, సెంటిమెంట్‌ అస్త్రాన్ని రగిలించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన కాంగ్రెస్‌, తెలంగాణ అభివృద్దిని అడ్డుకున్న టీడీపీ, రెండూ జట్టుకట్టడమేంటని విమర్శించారు. అడుక్కుంటే తామే నాలుగు సీట్లు ఇచ్చేవాళ్లం కదా... మళ్లీ అధికారం ఆంధ్రోళ్లకు అప్పగిస్తారా? తెలంగాణ కోసం ఇంత మంది చచ్చిపోయింది ఇందుకేనా? చావు దగ్గరకుపోయి తెలంగాణ తెచ్చింది ఇందుకేనా?. అమరావతికి తెలంగాణను తాకట్టు పెడతారా? ఢిల్లీ కాంగ్రెస్‌కు గులాం అవుతారా అంటూ, కూటమిపై నిప్పులు చెరిగారు. ఇందూరు సభ సాక్షిగా, ఎన్నికల హీట్‌ పెరిగింది. మహాకూటమి టార్గెట్‌గా గులాబీ దళాధిపతి అస్త్రాలు సంధించారు. కూటమి నేతలు కూడా మాటల యుద్ధంలో కత్తులు దూస్తున్నారు. మున్ముందు డైలాగ్‌ వార్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో, నిజామాబాద్ సభ ట్రైలర్‌ రూపంలో సిగ్నల్‌ ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories