స్వామి పరిపూర్ణానంద బహిష్కరణలో కొత్త ట్విస్ట్

x
Highlights

శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద హైరదాబాద్ నగర బహిష్కరణ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటికొస్తున్నాయి. తాజాగా పరిపూర్ణానంద స్వామి...

శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద హైరదాబాద్ నగర బహిష్కరణ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటికొస్తున్నాయి. తాజాగా పరిపూర్ణానంద స్వామి మధురపూడి ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు టికెట్ బుక్ చేసుకున్నారు. తనపై ఉన్న బహిష్కరణ హైదరాబాద్ వరకే పరిమితమని కొత్త లాజిక్ బయటకి తీశారు. ఇప్పుడు తాను సైబరాబాద్ పరిధిలో ఉండేందుకు వెళ్తున్నానని సమాచారం ఇచ్చారు. దీంతో అలర్టైన సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు వెంటనే తమ తమ కమిషనరేట్ల పరిధిలో స్వామీజీపై 6 నెలల పాటు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన నోటీసులు తీసుకొని హైదరాబాద్ నుంచి పోలీసులు కాకినాడకు బయల్దేరినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories