కొత్తగా నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ..
ఇటీవల ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ నామినేటెడ్ స్థానాలు రాష్ట్రపతి భర్తీ చేశారు. ప్రధాని కార్యాలయం సిఫారసు మేరకు ఆరెస్సెస్ సిద్ధాంతకర్త రాకేశ్ సిన్హా, రామ్ సకల్, సంప్రదాయ నృత్యకారిణి సోనాల్ మాన్‌సింగ్, శిల్పి రఘునాథ్ మహాపాత్రోలు రాజ్యసభకు నామినేట్ చేశారు రాష్ట్రపతి కోవింద్. ఈ మేరకు వీరిని ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇటీవలే పదవీకాలం ముగిసిన వారు సచిన్, నటి రేఖ, న్యాయవాది పరాశరణ్, సామాజిక కార్యకర్త అను ఆగాల స్థానంలో వీరిని ఎంపికచేశారు. కాగా వీరి పదవీకాలం 2024లో ముగుస్తుంది.
Next Story




