లారీ ఢీకొని నవవరుడు దుర్మరణం

nanireddy
Updated on: 24 Dec 2018 1:30 PM IST
లారీ ఢీకొని నవవరుడు దుర్మరణం
X

లారీ ఢీకొని నవ వరుడు దుర్మరణం చెందాడు ఈ ఘటన కరీంనగర్ జిల్లా మెట్ పల్లి మండలం మారుతినగర్‌ లో నిన్న (సోమవారం) చోటుచేసుకుంది. ఓదెల మండలం పొత్కపల్లికి చెందిన మొండెద్దుల రాజశేఖర్‌(24) కు మెట్‌పల్లికి చెందిన సంధ్యతో గతనెల 30న వివాహం జరిగింది. రాజశేఖర్‌ హైదరాబాద్ లోని కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కల్యాణ లక్ష్మి పథకం పని మీద సోమవారం రాజశేఖర్ అత్తారింటికి వచ్చాడు.. అనంతరం తన భార్యతో కలిసి బైక్ పై వెళుతున్నారు మార్గంమధ్యలో పైపుల లోడుతో వెళుతున్న లారీ అతివేగం కారణంగా అదుపుతప్పి బైక్ ను డీకోట్టింది. దీంతో రాజశేఖర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. భార్య సంధ్యకు తీవ్ర గాయాలవడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story