తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్..జయ జ్యూస్ తాగుతున్న దృశ్యాలు..!

nanireddy
Updated on: 24 Dec 2018 12:25 PM IST
తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్..జయ జ్యూస్ తాగుతున్న దృశ్యాలు..!
X

తమిళనాడులో ఆర్కేనగర్ లో రేపు ఉపఎన్నిక జరుగుతుండగా అందరూ ఆ ఎన్నికపై దృష్టిపెట్టారు.. ఇంతలో జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు దినకరన్ వర్గం హఠాత్తుగా అందరికి షాక్ ఇచ్చారు.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత... హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విజువల్స్‌ బహిర్గతమయ్యాయి. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన నేతలు...జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను రిలీజ్ చేశారు. ఆర్కే నగర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజువల్స్‌ రిలీజ్ కావడంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జయలలిత మృతి చెందిన ఏడాది తర్వాత విజువల్స్ బయటకు రావడం కలకలం రేపుతోంది.

nanireddy

nanireddy

Next Story