ఫేస్‌బుక్, స్వీట్ పాన్ చీటింగ్ కేసులో కొత్త ట్విస్ట్

x
Highlights

హైదరాబాద్ ఫేస్‌బుక్ చీటింగ్ కేసులో.. కొత్త ట్విస్ట్ బయటికొచ్చింది. ఈ వ్యవహారంలో నిందితుడు ఉపేంద్రవర్మ సోదరుడు.. సురేంద్ర వర్మ బాంబ్ పేల్చారు. తమపై...

హైదరాబాద్ ఫేస్‌బుక్ చీటింగ్ కేసులో.. కొత్త ట్విస్ట్ బయటికొచ్చింది. ఈ వ్యవహారంలో నిందితుడు ఉపేంద్రవర్మ సోదరుడు.. సురేంద్ర వర్మ బాంబ్ పేల్చారు. తమపై ఫిర్యాదు చేసిన అమ్మాయికి.. ఇంతకుముందే చాలామంది అబ్బాయిలతో సంబంధం ఉందని ఆరోపిస్తూ.. అందుకు తగ్గ ఆధారాలను కూడా బయటపెట్టారు. తన తమ్ముడు ఉపేంద్రవర్మను వదిలేయడానికి.. కోటి డిమాండ్ చేసిందని చెప్పారు. దీంతో.. ఈ కేసు ఇప్పుడు ఏ టర్న్ తీసుకోబోతుందనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఫేస్ బుక్, స్వీట్ పాన్ చీటింగ్ కేసులో.. కొత్త కోణం వెలుగుచూసింది. మయూర్ పాన్ షాప్ యజమాని ఉపేంద్రవర్మ కేసులో అతని సోదరుడు సురేంద్రవర్మ.. బాధితురాలిపై ఆరోపణలకు దిగారు. ఆ అమ్మాయికి.. ఇంతకుముందే చాలామంది అబ్బాయిలతో సంబంధం ఉందని.. వాటికి సంబంధించిన ఫోటోలను మీడియా ముందు రిలీజ్ చేశారు.

తన తమ్ముడు ఉపేంద్రవర్మను కూడా.. ఆ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేసిందని ఆరోపించారు సురేంద్రవర్మ. తమను కోటి రూపాయలు డిమాండ్ చేసిందని చెప్పారు. అంతేకాదు బాధితురాలికి డ్రగ్స్ అలవాటు కూడా ఉందన్నారు. త్వరలోనే ఈ అమ్మాయి వ్యవహారానికి సంబంధించి.. సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇక ఉపేంద్ర వర్మ స్వీట్ పాన్‌లో మత్తుమందు కలిపి బాధితురాలిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలపైనా అతని సోదరుడు స్పందించారు. తమ పాన్‌ షాప్‌లలో పాన్‌లలో మత్తు పదార్థాలు కలిపి అమ్ముతున్నట్లు నిరూపిస్తే తమకు ఉన్న అన్ని బ్రాంచ్‌లు మూసేస్తామని చెప్పారు.

ఇదిలా ఉంటే.. బాధితురాలికి మద్దతుగా మహిళాసంఘాలు రంగంలోకి దిగాయి. కింగ్‌ కోఠిలోని మయూరి పాన్ హౌస్ ముందు ఆందోళన చేశారు. ఉపేంద్రవర్మను కఠినంగా శిక్షించే వరకు.. నగరంలోని మయూరి పాన్ షాప్‌లను మూసేయాలని డిమాండ్ చేశారు.
చీటింగ్ చేసి అత్యాచారం చేసిన కేసులో.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు ఉపేంద్రవర్మ రిమాండ్‌లో ఉన్నాడు. అతనికి సహకరించిన స్నేహితులు అజిత్, మనీష్ జైన్, సాజబ్‌ను కూడా రిమాండ్‌కి తరలించారు. పరారీలో ఉన్న ఓం, రాజేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉపేంద్రవర్మ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ.. బాధితురాలు ఆధారాలు చూపించడం.. ఆ అమ్మాయికి ఇంతకు ముందే వేరే వాళ్లతో సంబంధాలున్నాయని.. నిందితుడి సోదరుడు ఆధారాలు బయటపెట్టడంతో.. ఈ కేసు ఇప్పుడు ఏ టర్న్ తీసుకోబోతుందనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories