వారి కుటుంబాన్ని నేను ఆదుకుంటా : హీరో విశాల్

nanireddy
Updated on: 24 Dec 2018 1:25 PM IST
వారి కుటుంబాన్ని నేను ఆదుకుంటా : హీరో విశాల్
X

శనివారం కూతురి నీట్ పరీక్ష కోసమని వెళ్లిన ఓ తండ్రి గుండెపోటు కారణంగా మృతిచెందాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. చెన్నైకి చెందిన కృష్ణస్వామి అనే వ్యక్తి తన కూతురు కస్తూరి మహాలింగంతో కలిసి కేరళ చేరుకున్నాడు. ఆదివారం కస్తూరి నీట్ పరీక్ష రాయాల్సి ఉంది. అందుకోసం కేరళలోని ఓ హోటల్ లో దిగారు. శనివారం వేకువజామున కృష్ణస్వామికి తీవ్ర గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అప్పటికే మరణించాడు. ఇక కృష్ణస్వామి మృతిపట్ల నటుడు విశాల్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు. మృతుడి కుమార్తె కస్తూరి మహాలింగంను ఫోనులో పరామర్శించాడు అనంతరం వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని మాట ఇచ్చాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు విశాల్.

nanireddy

nanireddy

Next Story