న‌య‌న్‌కి రెండు సినిమాల్లోనూ..

న‌య‌న్‌కి రెండు సినిమాల్లోనూ..
x
Highlights

త‌మిళంలో లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది న‌య‌న‌తార‌. అక్క‌డ చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్న న‌య‌న్‌.. తెలుగులో మాత్రం సెలెక్టివ్‌గా సినిమాలు...

త‌మిళంలో లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది న‌య‌న‌తార‌. అక్క‌డ చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్న న‌య‌న్‌.. తెలుగులో మాత్రం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. గ‌తేడాది విడుద‌లైన 'బాబు బంగారం' త‌రువాత ఏడాది గ్యాప్ తీసుకున్న న‌య‌న‌తార‌.. ప్ర‌స్తుతం రెండు తెలుగు చిత్రాల‌తో బిజీగా మారింది. ఆ రెండు సినిమాలు కూడా ప్రెస్టీజియ‌స్ మూవీస్ కావ‌డం విశేషం. చిరంజీవి 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'తో పాటు బాల‌కృష్ణ 102వ చిత్రంలోనూ న‌య‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే.. ఈ రెండు చిత్రాల్లోనూ న‌య‌న్ సోలో హీరోయిన్ కాదు. ఆమెతో పాటు మ‌రో ఇద్ద‌రు క‌థానాయిక‌లు కూడా ఉంటారు. పేరుకి ముగ్గురు హీరోయిన్లు ఉన్నా.. రెండు చిత్రాల్లోనూ న‌య‌నతారే లీడింగ్ హీరోయిన్‌. ఈ రెండు చిత్రాల‌కీ న‌య‌న్ భారీగానే రెమ్యూన‌రేష‌న్ తీసుకుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories