నందమూరి హరికృష్ణ కన్నుమూత

nanireddy
Updated on: 24 Dec 2018 2:46 PM IST
నందమూరి హరికృష్ణ కన్నుమూత
X

నందమూరి కుటుంబలో మరో విషాదం చోటుచేసుకుంది. నటుడు హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అయన ప్రయాణిస్తున్న కారు నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలపాలైన ఆయనను చికిత్స నిమిత్తం నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో హరికృష కన్నుమూశారు. హైదరాబాద్‌ నుంచి నెల్లూరులో వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హరికృష మృతితో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

nanireddy

nanireddy

Next Story