హరికృష్ణ చివరిసారిగా రాసిన లేఖ..

nanireddy
Updated on: 24 Dec 2018 2:46 PM IST
హరికృష్ణ చివరిసారిగా రాసిన లేఖ..
X

మాజీ ఎంపీ, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ మృతిచెందడంతో నందమూరి అభిమానులు షాక్ లో మునిగిపోయారు. సెప్టెంబర్‌ 2 న అయన జన్మదినం సందర్బంగా అభిమానులనుద్దేశించి రాసిన లేఖ పలువురిని కంటతడి పెట్టిస్తోంది. తన జన్మదిన వేడుకలను జరపవద్దని.. ఆ డబ్బును కేరళ వరద బాధితులకు ఇస్తే బాగుంటుందని చివరిసారిగా అభిప్రాయపడ్డారు.
'సెప్టెంబర్‌ 2 నా అరవై రెండవ పుట్టిన రోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరుపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా ఎంతో మంది మరణించారు. వేల మంది నిరాశ్రయులైనారు.

ఇది మన అందరికి ఎంతో విషాదాన్ని కలిగించిన విషయం. అందు చేత నా జన్మదిన సందర్భంగా బేనరులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గచ్ఛాలు, దండలు తీసుకు రావద్దని వాటికి అయ్యే ఖర్చుని వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను' అంటూ హరికృష్ణ అభిమానులనుద్దేశించి లేఖ రాశారు.

nanireddy

nanireddy

Next Story