తొందరపడి వైసీపీని వీడొద్దు..

తొందరపడి వైసీపీని వీడొద్దు..
x
Highlights

ఇప్పుడిప్పుడే బలపడుతుందనుకుంటున్న వైసీపీ.. ఎన్నికల ముందు ఆ పార్టీనుంచి మళ్ళీ వలసలు ఊపందుకునేలా కనిపిస్తున్నాయి.. ఇప్పటికే గుంటూరు జిల్లా వైసీపీలో...

ఇప్పుడిప్పుడే బలపడుతుందనుకుంటున్న వైసీపీ.. ఎన్నికల ముందు ఆ పార్టీనుంచి మళ్ళీ వలసలు ఊపందుకునేలా కనిపిస్తున్నాయి.. ఇప్పటికే గుంటూరు జిల్లా వైసీపీలో ముసలం మొదలయింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. ఇటీవల టీడీపీ మహిళా నేత విడదల రజిని జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక అయన పార్టీ మారుతారన్న వార్త రాగానే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మర్రి రాజశేఖర్‌ను కలిశారు. ఈ సందర్బంగా రాజశేఖర్‌ గృహంలో వీరు ఏకాంతంగా రెండుగంటలపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ తనకు జరిగిన అన్యాయం గురించి రామకృష్ణారెడ్డి వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. దీనికి రామకృష్ణారెడ్డి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని ఈ విషయమై పార్టీలో చర్చ జరుగుతున్నదని రాజశేఖర్‌తో అన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories