వరుసకు అక్క అయ్యే వివాహితతో అక్రమ సంబంధం.. ఆపై..

వరుసకు అక్క అయ్యే వివాహితతో అక్రమ సంబంధం.. ఆపై..
x
Highlights

వరుసకు అక్క అయ్యే వివాహితతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు.. వద్దని ఎంత చెప్పినా వినక పోవడంతో కళ్లలో కారం చల్లి భార్య ఎదుటే భర్త దారుణహత్యకు ఒడిగట్టారు....

వరుసకు అక్క అయ్యే వివాహితతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు.. వద్దని ఎంత చెప్పినా వినక పోవడంతో కళ్లలో కారం చల్లి భార్య ఎదుటే భర్త దారుణహత్యకు ఒడిగట్టారు. దీంతో తీవ్ర గాయాలతో వ్యక్తి సదరు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండ లం సాదుల్ల నగర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. సాదుల్ల నగర్‌కు చెందిన చెక్కల భాస్కర్‌(32) మండలంలోని బోర్పట్ల శివారు లోని ఓ పరిశ్రమలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. భాస్కర్‌ మేనబావ ఎర్రోల్ల ప్రభు సైతం అదే గ్రామంలో వారి ఇంటి పక్కనే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ప్రభు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఇరు కుటుంబాల వారికి తెలియడంతో పంచాయితీ పెట్టి రాజీ కుదిర్చారు. కానీ భాస్కర్ తీరులో మార్పు రాలేదు.. ఈ క్రమంలో అతడి హత్యకు పథకం వేశారు మేనబావలు. ఆదివారం భాస్కర్‌ ఇంట్లో నిద్రిస్తుండగా, మేనబావలు అయిన ఎర్రొల్ల ప్రభాకర్, ఎర్రొల్ల రమేశ్, ఎర్రొల్ల వీరేశం, శ్రీకాంత్‌తో పాటు మరికొందరు ఇంట్లోకి చొరబడి కారంపొడిని భాస్కర్‌ కళ్లల్లో కొట్టారు. అనంతరం ఇంట్లోనుంచి బయటకు లాక్కొచ్చి గొడ్డళ్లతో కిరాతకంగా నరికి చంపారు. భార్య తన భర్తను చంపొద్దని ఎంత వారిస్తున్నా వినకుండా ఆమెపై కూడా దాడి చేయబోయారు ఇంతలో గ్రామస్థులు రావడంతో అక్కడినుంచి పారిపోయారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులకోసం గాలిస్తున్నారు. కాగా ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామం ఉలికిపాటుకు గురైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories