మరోసారి జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

nanireddy
Updated on: 24 Dec 2018 2:55 PM IST
మరోసారి జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా అనంతపురం ప్రబోధానంద స్వామి శిష్యులకు, కొంతమంది గ్రామస్థులకు వివాదం మొదలై చినికి చినికి గాలివానగా మారింది. దీంతో ఇరువర్గాలో రాళ్లతో దాడి చేసుకున్నారు. పైగా ట్రాక్టర్లు, బైకులకు నిప్పంటికోవడంతో గొడవ మరింత పెద్దదయింది. ఇక ఈ గొడవ గురించి తెలుసుకున్న ఎంపీ జేసీ దివాకర రెడ్డి సంఘటనాస్థలికి బయల్దేరారు. శాంతిభద్రతలు తలెత్తుతాయన్న కారణంగా పోలీసులను ఆయనను మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో ఎంపీ జేసీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల్లో ఎప్పుడో పౌరుషం చచ్చిపోయిందని, ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో రౌడీలకు సపర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా డేరా బాబా ఆశ్రమానికి వెళ్లిన పోలీసులు.. ప్రబోధానంద ఆశ్రమానికి ఎందుకు వెళ్లలేకపోతున్నారని అయన పోలీసులపై ఎదురుదాడి చేశారు.

nanireddy

nanireddy

Next Story